Search This Blog

Sunday, August 26, 2018

ఆండ్రాయిడ్ మొబైల్స్ యొక్క బ్యాటరీ లైఫ్ ను పెంచే 10 టిప్స్

              స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్ సమస్యలు కామన్‌గా మారిపోయాయి. ఈ సమస్యలను అధిగమించే ప్రయత్నంలో ఎక్కువ శాతం మంది యూజర్లు థర్డ్ పార్టీ బ్యాటరీ సేవింగ్ యాప్స్ పై ఆధారపడతున్నారు.కొన్ని సందర్భాల్లో మీరు వాడే యాప్స్ వల్ల కూడా బ్యాటరీ బ్యాకప్‌ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి, ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తమ వంతు ఏకాగ్రతతో బ్యాటరీ సేవింగ్ మర్గాలను అనుసరించటం ద్వారా మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చు. ఈ శీర్షిక లో భాగంగా స్మార్ట్‌ఫోన్ యూజర్‌కు ఉపయోగపడే 10 బ్యాటరీ సేవింగ్ టిప్స్ ను మీకు తెలుపుతున్నాము. ఓ లుక్కేయండి.




Check The Apps Which Is Using More Power.
ఫోన్‌లో మీరు క్లోజ్ చేసే అప్లికేషన్స్, మీ కళ్ల ముందు కనిపించక పోయినప్పటికి, బ్యాక్ గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. ఇవి బ్యాటరీ బ్యాకప్‌ను వృథాగా ఖర్చు చేసేస్తుంటాయి. ఫోన్ బ్యాటరీ సెట్టింగ్స్‌లోకి వెళ్లటం ద్వారా ఏఏ యాప్ ఎంతెంత బ్యాటరీ శక్తిని ఖర్చు చేసుకుంటుందో తెలుసుకోవచ్చు. తద్వారా వాటిని మానిటర్ చేసుకోవచ్చు.ఇలా తెలుసుకోవచ్చు Setting > About phone > Battery use.


Stop Unnecessary Services
అనవసరైమైన సర్వీసెస్ ను ఆపేయండి ఎందుకంటే అది బ్యాటరీ లైఫ్ ను కాజేస్తుంది. రన్నింగ్ సర్వీసెస్ ఆపేయడానికి Settings > Applications > Running services. తరువాతి స్క్రీన్ లో మీరు వారి RAM మొత్తం వాడకంతో సేవల జాబితా కనుగొంటారు. మీరు ప్రస్తుతం ఉపయోగించని సాఫ్ట్వేర్ అప్డేట్, ఈమెయిల్ మరియు ఇతర సేవల వంటి సేవలను ఆపివేయవచ్చు. ఇది యాండ్రాయిడ్ బ్యాటరీ లైఫ్ ను పెంచుతుంది.

 




Turn Off Bluetooth And WiFi After Usage.
వై-ఫై, బ్లుటూత్ వంటి ఫీచర్లు బ్యాటరీ శక్తిని తినేయడం లో ముందు వరసలో ఉంటాయి. కాబట్టి, ఈ ఫీచర్లను అవసరం మేరకే వాడుకోండి. అవసరంలేని సమయంలో టర్నాఫ్ చేసేయండి.
 

Reduce Multitasking
ఒకే సరి మల్టీపుల్ యాప్స్ రన్ చేస్తే బ్యాటరీ డౌన్ అయిపోతుంది అందువల్ల మల్టీ టాస్కింగ్ ను తగ్గించండి.
 

Turn Off Internet After Use
స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ ఉపయోగించిన తరువాత ఎప్పటికప్పుడు Turn Off చేయండి.
 


Turn Off GPS.
స్మార్ట్ ఫోన్ లో GPS ను వాడిన తరువాత Turn Off చేయండి. GPS Turn Off చేయడానికి ఇలా చేయండి Settings > Security and Location > Enable/disable GPS.
 

Turn Off Your Hotspot After Use.
హాట్ స్పాట్ వల్ల బ్యాటరీ లైఫ్ త్వరగా దెబ్బతింటుంది . కాబట్టి, ఈ ఫీచర్లను అవసరం మేరకే వాడుకోండి. అవసరంలేని సమయంలో Turn Off చేసేయండి.
 

Decrease Display Brightness Or Disable Auto
ఫోన్ డిస్‌ప్లే బ్రైట్నెస్‌ను ఆటో బ్రైట్నెస్ ఆప్షన్ ద్వారా మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా ఎంతో కొంత బ్యాటరీ ఆదా అవుతుంది. స్ర్కీన్ టైమ్ అవుట్‌ను మరింత తగ్గించుకోవటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ ఆదా అవుతుంది. ఫోన్ వైబ్రేషన్స్ టర్నాప్ చేయటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ ఆదా అవుతుంది. ఫోన్‌లోని అప్లికేషన్‌లను తరచూ అప్‌డేట్ చేసుకోవటం ద్వారా యాప్స్ ఎక్కువ బ్యాటరీ పవర్‌ను ఖర్చు చేయవు.
 

Turn On Power Saver Mode
మీ ఫోన్‌లో బ్యాటరీ సేవింగ్ మోడ్ ఆప్షన్ ఉన్నట్లయితే, బ్యాటరీ డౌన్ అయిన వెంటనే ఆటోమెటిక్‌గా ఆ ఫీచర్ యాక్టివేట్ అయ్యే విధంగా ఫోన్ సెట్టింగ్స్‌ను మార్చుకోండి.
 

Avoid Overcharging Of Battery.
మొబైల్ ను ఎక్కువ సేపు ఛార్జింగ్ పెట్టకండి.

No comments:

Post a Comment

How to use kaiber ai free ! Kaiber ai free me use kaise kare

How to use kaiber ai free ! Kaiber ai free me use kaise kare https://www.youtube.com/watch?v=IFPOvlfBhaw