చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియా మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. Poco F1 పేరుతో మార్కెట్ లోకి రాబోతుంది .ఈ నేపథ్యంలో ఈ Poco F1 ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ ఈ రోజు ఇండియాలో జరగనుంది. Poco సిరీస్ నుంచి రాబోయే మొదటి స్మార్ట్ ఫోన్ కావడం వలన షియోమి అభిమానులు ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అదిరిపోయే ఫీచర్లతో అధునాతనమైన టెక్నాలజీ తో ఈ ఫోన్ ను తయారు చేసినట్టు కంపెనీ తెలిపింది.మొదటి సారిగ లిక్విడ్ కాలింగ్ సిస్టం అనే సరికొత్త టెక్నాలజీనీ ఇందులో ప్రవేశపెట్టినట్ట కంపెనీ తెలిపింది.మరికొద్ది రోజుల్లో ఈ Poco F1 ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో ఎక్సక్లూసివ్ గా లభిస్తుంది.
Master Of Speed అనే # ట్యాగ్ తో....
Master Of Speed అనే # ట్యాగ్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేయబోతున్నారు. ఈ # ట్యాగ్ బట్టే తెలిసిపోతుంది ఫోన్ పనితీరు ఎంత వేగంగా ఉండబోతుందో.
రెండు వేరియంట్లలో....
రెండు వేరియంట్లలో....
మొదటి వేరియంట్ 6జీబీ ర్యామ్,64జీబీ స్టోరేజ్ తో లభిస్తుంది రెండవ వేరియంట్ 6జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ తో లభిస్తుంది.
ధర....
షియోమి తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Poco F1 ధర పై ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ మొదటి వేరియంట్ ధర సుమారు రూ.34,000 ఉండవచ్చని అలాగే రెండవ వేరియంట్ ధర సుమారు రూ.36,000 ఉండవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి.
పోకోఫోన్ సిరీస్ నుంచి విడుదలయ్యే మొదటి ఫోన్......
పోకోఫోన్ సిరీస్ నుంచి విడుదలయ్యే మొదటి ఫోన్......
ఈ పోకోఫోన్ ప్రీమియమ్ సెగ్మెంట్ క్రిందకు రాబోతోంది. పోకోఫోన్ సిరీస్ నుంచి విడుదలయ్యే మొదటి ఫోన్ Poco F1 పేరుతో ఫ్లిప్ కార్ట్ లో లభ్యమవుతుంది.
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్....
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి శక్తివంతమైన ఫీచర్లను ఈ ఫోన్ క్యారీ చేయబోతోంది.
లిక్విడ్ కూలింగ్ సిస్టమ్.....
లిక్విడ్ కూలింగ్ సిస్టమ్.....
ఈ ఫోన్‌లలో ఏర్పాటు చేయబోతోన్న ప్రత్యేకమైన లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ హీటింగ్‌ను నిరోధించి ఫోన్ పనితీరును రెట్టింపు చేస్తుంది.
ఐఫోన్ ఎక్స్ తరహా notch స్క్రీన్....
ఐఫోన్ ఎక్స్ తరహా notch స్క్రీన్....
ఐఫోన్ ఎక్స్ తరహా notch స్క్రీన్ కూడిన 6.18 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో షియోమీ ఏర్పాటు చేసింది . ప్రీమియమ్ మెటల్ యునిబాడీతో రాబోతోన్న ఈ ఫోన్ ఏకంగా 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. ఐఆర్ ఫేస్ అన్‌లాక్ టెక్నాలజీని కూడా ఈ కెమెరా సపోర్ట్ చేస్తుంది . యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి అత్యాధునిక కనెక్టువిటీ ఫీచర్లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
Pocophone F1 ఫీచర్స్....
Pocophone F1 ఫీచర్స్....
6.18 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే విత్2160x 1080పిక్సల్స్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ వన్ ప్లాట్ ఫామ్ విత్ ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 SOC ప్రాసెసర్ , అడ్రిన్ 512 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,6జీబీ ర్యామ్ , స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్విక్ ఛార్జ్ సపోర్ట్.
No comments:
Post a Comment