Search This Blog

Thursday, August 23, 2018

DHOLAVEERA ఇక్కడ ఆ అక్షరాలను చదివడం మీకు తెలిస్తే చాలు వేలకోట్ల సంపద మీ వశం

ఇక్కడ ఆ అక్షరాలను చదివడం మీకు తెలిస్తే చాలు వేలకోట్ల సంపద మీ వశం
Telugu Nativepalnet 22 Aug. 2018 14:57
ధోలావీరా చరిత్ర అంటే ఇష్టపడేవారు సందర్శించే పర్యాటక స్థలాల్లో మొదటి వరుసలో ఉంటుంది. ఇది గుజరాత్ జిల్లాలోని కచ్ జిల్లా, భచావ్ తాలూకా, ఖదిర్ బెట్ వద్ద ఉన్న పురావస్తుశాఖ కేంద్రం. ఇక్కడికి కిలోమీటరు దూరంలో ఉన్న ధోలావీరా అనే గ్రామం వల్ల ఈ ప్రాంతాన్ని కూడా ధోలావీరా అని పిలుస్తారు.

సింధు లోయనాగరికతకు చెందిన ఈ ప్రాంతంలో లక్షల కోట్ల రుపాయల విలువచేసే బంగారు, వెండి, వజ్రాలు ఉన్నయని చెబుతారు. అయితే ఇందుకు సంబంధించిన దారి ఒక విచిత్ర లిపిలో ఉందని కొంతమంది చెబుతారు.

అయితే పురావస్తుశాఖ అధికారులు అది నిధికి సంబంధించిన రాత కాదని కేవలం ధోలావీరా ప్రాంతంలో అప్పటి ప్రజలు వినియోగించే భాష మాత్రమేనని చెబుతారు. ఈ నిధి గొడవను పక్కన పెడితే చరిత్ర గురించి తెలుసుకోవడంతో పాటు ఈ ధోలావీరా చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన వివరాలు మీ కోసం...



ధోలావీరా

P.C: You Tube

ధోలావీరా భారత దేశంలోని సింధులోయ నాగరికతకు చెందిన ప్రముఖ స్థలాల్లో ఒకటి. ఈ ధోలావీరా రాన్ ఆఫ్ కచ్ లోని కచ్ ఎడారి వన్యప్రాణి సంరక్షణాలయంలోని ఉంది. ఈ ధోలావీరాకు ఇరువైపులా మన్ సార్, మన్ హార్ అనే రెండు వాగులు నెలకొని ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని 1967లో భారత పురాతత్వశాఖ సంస్థ డైరెక్టర్ జనరల్ జేపీ జ్యోషి కనుగొన్నారు.


ధోలావీరా

P.C: You Tube

ఈ ప్రాంతంలో ఇప్పటి వరకూ మొత్తం 13 తవ్వకాలు జరిపారు. ఇందులో పట్టణ ప్రణాళిక, వాస్తురీతులు వెలుగులోకి వచ్చాయి. అనేక ముద్రంలు, పూసలు, జంతువుల ఎముకలు, వాటితో చేసిన శిల్పాలు, ఆభరణాలు వెలుగులోకి వచ్చాయి. అంతే కాకుండా బంగారు, వెండి, మట్టి ఆభరణాలు, కంచుపాత్రలు కూడా లభించాయి.


ధోలావీరా

P.C: You Tube

పురావస్తు శాఖ అధికారుల అంచనా ప్రకారం ధోలావీరా దక్షిణ గుజరాత్, సింధ్, పంజాబ్, పశ్చిమాసియా జనావాసాల మధ్య ప్రధాన వర్తక కేంద్రంగా ఉండేది. ఈ ధోలావీరా లోథాల్ కంటే పురాతనమైనది. మొత్తం 48 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ధోలావీరా పట్టణం ఉంది. ఇక్కడ నిర్మాణాలన్నీ రాతివే. అయితే సింధు లోయ స్థలాలు దాదాపు అన్నింటిలోనూ ఇటుకలతో నిర్మించిన నిర్మాణాలు కనిపిస్తాయి.


ధోలావీరా

P.C: You Tube

ధోలావీరాలో నీటి నిల్వ కోసం వారు అనుసరించిన విధానాలు ప్రస్తుతం ఆ రంగంలోని శాస్త్రవేత్తలకు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా తటాకాలతో కూడిన నీటి పొదుపు వ్యవస్థ. నీటి పొదువు విషయానికి సబంధించి ప్రపంచంలోని ఇతర దేశాలన్నింటిలో కంటే ఈ విధానం అత్యంత ప్రాచీనమైనది.


ధోలావీరా

P.C: You Tube

ఏళ్ల కొద్ది వర్షాలు పడని ఎడారి ప్రదేశమైన కచ్ ప్రాంతపు పరిస్థితులకు అనుగుణంగా వీటిని నిర్మించినట్లు పురావాస్తు శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిపిన తవ్వకాల్లో 73.4 మీటర్ల పొడవు, 29.3 వెడల్పు, 10 లోతును కలిగిన చతుర్భుజాకారపు దిగుడుబావి. ఇది మొహెంజదారోలోని స్నానఘట్టం కంటే మూడు రెట్లు పెద్దది.


ధోలావీరా

P.C: You Tube

అదే విధంగా ఒక పెద్ద చక్రాకార నిర్మాణం కనుగొన్నారు. ఇది స్మారకం కాని సమాధి కాని అయి ఉండవచ్చునని చెబుతారు. ఈ నిర్మాణంలో చక్రంలోని ఆకుల్లాగా మట్టి గోడలున్నాయి. మెత్తటి రాతిలో చెక్కిన తల, కాళ్లు లేని ఒక మగ మనిషి రూపం, మట్టి ముద్రలు, గాజులు, ఉంగరాలు, పూసలు, చెక్కిన ప్రతిమలు కూడా కనిపిస్తాయి.


ధోలావీరా

P.C: You Tube

అదేవిధంగా రాతిలో నిర్మించిన ఏడు అర్థగోళాకార నిర్మాణాలను ధోలావీరాలో కనుగొన్నారు. వీటిలో రెండింటిలో వివరంగా తవ్వకాలు జరిపారు. ఒకటి ఆకులున్న చక్రంలాగా ఉండగా, రెండవది ఆకుల్లేని చక్రం లాగా ఉంటుంది. వాటిలో ఖనన సంబంధ మట్టి కుండలు ఉన్నాయి.


ధోలావీరా


P.C: You Tube

అంతేకాకుండా రాగి అద్దం, రాగి తీగకు పూసలను గుదిగుచ్చి తయారు చేసిన ఒక గొలుసు, ఒక బంగారు గాజు, బంగారు రేకు, ఇతర పూసలు కూడా ఇక్కడ కనిపించాయి. ఈ వస్తువలన్నింటినీ సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. ఈ నిర్మాణాలు తొలి బౌద్ధ స్థూపాలను పోలి ఉన్నాయని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు.


ధోలావీరా


P.C: You Tube

హరప్పన్లు మాట్లాడిన భాష గురించి ఎవరికీ తెలియదు. వారి లిపిని కూడా ఇంతవరకూ ఎవరూ చదవలేకపోయారు. దానిలో దాదాు 400 ప్రాథమిక గుర్తులు ఉన్నట్లు చెబుతారు. ఈ రాత కుడి నుంచి ఎడమకు రాసేవారు. శాసనాలు ఎక్కువగా ముద్రల మీద రాగి పలకల మీద ఉన్నాయి. ఒక వేల ఈ భాష మీకు చదవడం వస్తే లక్షల కోట్ల విలువచేసే సంపదకు సంబంధించిన మార్గం తెలుస్తుందని భావిస్తున్నారు.


ధోలావీరా


P.C: You Tube

ఈ ధోలావీరాలో కోట, మధ్యపట్టణం, దిగువ పట్టణం వంటి భాగాలను మనం గమనించవచ్చు. కోటకు జమిలి బురుజుల ద్వారా రక్షణ ఏర్పరిచారు. మధ్య, దిగువ పట్టణాల్లో ప్రభుత్వ ఉధ్యోగులు, సాధారణ ప్రజలు నివశించేవారు. ఇక ఇక్కడ లభించిన వస్తువులను సందర్శకులు చూసే ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment

How to use kaiber ai free ! Kaiber ai free me use kaise kare

How to use kaiber ai free ! Kaiber ai free me use kaise kare https://www.youtube.com/watch?v=IFPOvlfBhaw